సౌదీ పర్యటనకు వెళ్లిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్..వ్యూహం ఫలించేనా?
- October 02, 2019
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుచేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించనున్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కాశ్మీర్ విషయంలో చైనా, మలేషియా, టర్కీ దేశాలను కోరినట్లుగానే సౌదీ అరేబియాను మద్దతు కోరారు. అయితే కాశ్మీర్ అంశంపై వాస్తవ పరిస్థితిని వివరించేందుకు అజిత్ దోవల్ సౌదీ రాజధాని రియాద్‌కు వెళ్లారు. కాశ్మీర్ విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీఅరేబియాలు అంతగా స్పందించలేదు. సౌదీఅరేబియాలోని చమురు క్షేత్రాలపై జరిగిన దాడులతో ప్రపంచ మార్కెట్లో ఇంధనం కొరత ఏర్పడింది. భారత్‌కు సౌదీతో ఆయిల్ కొనుగోలుతో పాటు సత్సంబంధాలున్నాయి. ఉగ్రవాద నిర్మూలనకు భారత్‌తో సౌదీ కూడా కలుస్తోంది. కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా మద్దతు ఇవ్వకుండా ఉండేందుకు రాజు మమ్మద్ బిన్ సల్మాన్‌కు వాస్తవ పరిస్థితిని వివరించేందుకు అజిత్ దోవల్ రియాద్ పర్యటనకు వెళ్లారని సమాచారం.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!