ఉపరాష్ట్రపతి ఇంటికి ప్రధాని మోదీ

- October 02, 2019 , by Maagulf
ఉపరాష్ట్రపతి ఇంటికి ప్రధాని మోదీ

దిల్లీ: నవరాత్రి పూజలు ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రాత్రి 7 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లారు. ఇద్దరూ పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సుమారు గంటసేపు వారిద్దరూ మాట్లాడుకున్నారు. తన అమెరికా పర్యటన విశేషాలను ప్రధానమంత్రి ఉపరాష్ట్రతికి వివరించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడి సతీమణి ఉష, కుమార్తె దీప, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com