ఫలించిన అజిత్ దోవల్ పర్యటన ..కాశ్మీర్ అంశంపై భారత్ ను సమర్ధించిన సౌదీ..విస్మయంలో పాక్
- October 02, 2019
జెడ్డా: జమ్ము కశ్మీర్ పై భారత్ వైఖరిని సౌదీ అరేబియా సమర్ధించడంతో పాకిస్తాన్ విస్మయానికి గురైంది. తన ప్రధాన మద్దతుదారుగా భావిస్తున్న సౌదీ అత్యంత కీలకమైన కశ్మీర్ వ్యవహారంలో భారత్ వెన్నంటి నిలవడం పాక్‌కు మింగుడుపడటం లేదు. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బుధవారం సమావేశమై జమ్ము కశ్మీర్ పరిణామాలను వివరించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో జమ్ము కశ్మీర్‌కు సంబంధించి భారత్ ఇటీవల తీసుకున్న చర్యలు, అక్కడి పరిణామాలపై దోవల్ సౌదీ నేతకు క్షుణ్ణంగా వివరించారు. ఈ సమావేశంలో పలు ద్వైపాక్షిక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. జమ్ము కశ్మీర్ వ్యవహారంలో భారత్ చేపట్టిన చర్యలపై ఈ సందర్భంగా సౌదీ నేత సంతృప్తి వ్యక్తం చేశారు. కశ్మీర్‌పై పాక్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు కశ్మీర్ వ్యవహారం భారత అంతర్గత వ్యవహారంగా దోవల్ సౌదీ దృష్టికి తీసుకురాగలిగారు. భారత్‌తో జమ్ము కశ్మీర్ అంతర్భాగం కావడంతో పాటు అభివృద్ధిలో దేశంతో కలిసి నడిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దోహదపడుతుందని దోవల్ సౌదీ నేతకు వివరించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







