WhatsApp లో మరో ఆకర్షణీయమైన ఫీచర్
- October 02, 2019

వాట్సప్... ప్రపంచానికి ఏమాత్రం పరిచయం అవసరం లేని ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్. వాట్సప్ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్స్ రిలీజ్ చేయడమే కారణం. ఎప్పుడూ కొత్త ఫీచర్లపై పరిశోధన జరుగుతూనే ఉంటుంది. మొదట బీటా యూజర్లకు అప్డేట్స్ రిలీజ్ చేసి... మార్పుచేర్పులతో అందరికీ కొత్త ఫీచర్స్‌ని అందిస్తుంది వాట్సప్. ఇప్పుడు అలాంటి మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటివరకు వచ్చిన ఫీచర్లన్నిటితో పోలిస్తే ఈ ఫీచర్ చాలా ప్రత్యేకం. సాధారణంగా వాట్సప్‌లో మీరు ఎవరికైనా మెసేజ్ పంపిస్తే డిలిట్ చేసే అవకాశం గతంలో ఉండేది కాదు. కానీ... ఆ తర్వాత మెసేజ్‌ను డిలిట్ చేసే ఫీచర్ అందించింది వాట్సప్. ఇప్పుడు కొత్తగా 'డిసప్పియరింగ్ మెసేజెస్' ఫీచర్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. వాట్సప్ ఆండ్రాయిడ్ బీటా 2.19.275 వర్షన్లో ఈ ఫీచర్ వాడుకోవచ్చు.
వాట్సప్ 'డిసప్పియరింగ్ మెసేజెస్' ఫీచర్ యాక్టివేట్ చేస్తే మీరు పంపిన ఏ మెసేజ్‌నైనా జస్ట్ 5 సెకండ్లలో మాయం చేయొచ్చు. అంటే వాట్సప్ మెసేజ్ చేయగానే 5 సెకండ్లలో మాయమైపోతుంది. మీరు 5 సెకండ్ల నుంచి 1 గంట వరకు టైమ్ సెట్ చేసుకోవచ్చు. అంటే ఆ మెసేజ్ ఎంత సమయం కనిపించాలో మీరే నిర్ణయించొచ్చు. మీరు 1 గంట అని టైమ్ సెట్ చేస్తే సరిగ్గా గంట తర్వాత ఆ మెసేజ్ మాయమైపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సప్ గ్రూప్స్‌లో పరీక్షిస్తున్నారు. ఇది ఇప్పటికైతే బీటా వర్షన్‌లోనే ఉంది. ఫీచర్ సక్సెస్ అయిన తర్వాత మిగతా యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







