ఒమన్‌లో మళ్ళీ పెరిగిన వలసదారులు

- October 02, 2019 , by Maagulf
ఒమన్‌లో మళ్ళీ పెరిగిన వలసదారులు

మస్కట్‌: ఒమన్‌లో వలసదారుల సంఖ్య 2 మిలియన్లకు చేరువవుతోంది. 20 సెప్టెంబర్‌ 2019 నాటికి ఈ సంఖ్య 1,999,978గా వుంది. అక్టోబర్‌ 2 నాటికి ఈ సంఖ్య 2,001,090కి చేరింది. ఇదే సమయంలో ఒమనీయుల సంఖ్య 2,674,049గా వుంది. మస్కట్‌లో అత్యధిక సంఖ్యలో వలసదారులు వున్నారు. ఆ తర్వాతి స్థానం నార్త్‌ అల్‌ బతినా కాగా, మూడో స్థానంలో దోఫార్‌ నిలిచింది. అత్యల్ప సంఖ్యలో వలసదారులు ముసాందమ్‌లో వున్నారు. 2016లో వలసదారులు 45.8 శాతం వుండగా ఆ సంఖ్య 2017 నాటికి 45.5 శాతానికి తగ్గింది. 2018 నాటికి 44.2 శాతానికి తగ్గిన వలసదారులు, 2019 నాటికి 42.8 శాతానికి తగ్గారు. ప్రభుత్వం తీసుకున్న ఒమనైజేషన్‌ కారణంగా తగ్గుదల కన్పిస్తోంది.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com