మరో డిఫరెంట్ ప్రాజెక్ట్ తో సిద్ధమవుతున్న అక్షయ్ కుమార్
- October 03, 2019
బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హీరో అక్షయ్ కుమార్ మరో డిఫరెంట్ ప్రాజెక్ట్ తో సిద్దమవుతున్నాడు. గ్యాప్ లేకుండా నిరంతరం ఎదో ఒక ప్రయోగంతో ఆడియెన్స్ ని ఆకట్టుకునే అక్షయ్ ఈ సారి సౌత్ ఇండియన్ రీమేక్ తో రచ్చ చేయనున్నాడు. కోలీవుడ్ సూపర్ హైర్ మూవీ కాంచన సౌత్ లో బాక్స్ ఆఫీస్ గా నిలిచింది.
ఆ హారర్ సినిమాను అక్షయ్ హిందీలో లక్ష్మి బాంబ్ గా రీమేక్ చేస్తున్నాడు. కథ ఒరిజినల్ దర్శకుడు లారెన్స్ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే సినిమాలో కాంచన పాత్రలో కనిపించబోయే అక్షయ్ లుక్ ని విడుదల చేశారు. హిజ్రాగా అక్షయ్ చీరలో చాలా బావున్నాడని నెటిజన్స్ పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. నార్త్ ఆడియెన్స్ కి తగ్గట్టుగా సినిమా మేకింగ్ లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కానీ పాత్రల విషయంలో లారెన్స్ చేంజెస్ కోరుకోవడం లేదట. సినిమాపై ఇప్పటికే బాలీవుడ్ లో అంచనాల డోస్ పెరిగింది. ఇక నెక్స్ట్ టీజర్ తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచాలని చూస్తున్నారు. మరి ఈ సినిమాతో అక్షయ్ కుమార్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!