యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఫాలో ఫాలో యూ' అనే పాట ఆలపించారు..
- January 10, 2016
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపైనే కాదు నిజ జీవితంలో కూడా చాలా ఎనర్జిటిక్ గా ఉంటారని అందరూ చెప్తుంటే ఏమోగానీ ఈ వీడియో చూస్తే మాత్రం నిజమేనని ఫిక్స్ అవ్వాల్సిందే. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న నాన్నకు ప్రేమతో చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. టైటిల్ తోనే అందరినీ ఆకర్షించిన ఈ చిత్రం ప్రతి రోజూ ఏదో ఒకరూపంలో పబ్లిసిటీలో దూసుకెళ్లుతోంది. ఆ చిత్ర యూనిట్ నాన్నకు ప్రేమతో చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను, మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ చిత్ర హైప్ ను మరింత పెంచేస్తుంది.తాజాగా ఇప్పటికే అందరి నోళ్లలో నానుతున్న 'ఫాలో ఫాలో యూ' అనే పాట మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేశారు.ఈ పాటను ఎన్టీఆరే ఆలపించారు. ఈ సమయంలో యంగ్ టైగర్ ఉత్సాహం చూస్తుంటే.. ఈయన యాక్టరా లేక పాప్ సింగరా అని అనిపించేట్లుగా కనిపించారు. ఏ మాత్రం బెరుకు లేకుండా రికార్డింగ్ థియేటర్లో పక్కనే దేవీ శ్రీ ప్రసాద్ సూచనలు చేస్తుండగా అదిరిపోయే స్టైల్ తో 'ఫాలో ఫాలో యూ' అనే గీతాన్ని ఎన్టీఆర్ ఆలపించారు. పాడే సమయంలో ఎన్టీఆర్ ఉత్సాహాన్ని చూసి కుర్చీలో కూర్చోబుద్ధిగానీ దేవీ శ్రీ కూడా లేచి నిల్చోని ఎన్టీఆర్ తో జతకట్టారు. ఆ వెంటనే ఈ చిత్ర నిర్మాత బీవీఎస్ఎల్ ప్రసాద్ తో కలిసి ఇద్దరూ ఫాలో ఫాలో యూ అంటూ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతూ రికార్డింగ్ థియేటర్లో సందడి చేశారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







