ఘాటుగా స్పందించినా బాలకృష్ణ ..

- January 10, 2016 , by Maagulf
ఘాటుగా స్పందించినా బాలకృష్ణ ..

తెలుగు చలన రంగంలోకి సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తండ్రికి తగ్గట్టుగానే సాంఘిక,పౌరాణిక,జానపద చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ మద్య కాస్త అపజయాలు చవిచూసినా..ఈ మద్య ఫ్యాక్షన్ తరహా చిత్రాల్లో నటిస్తూ పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకులను రక్తి కట్టిస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తూ వస్తున్నారు. ఇక లెజెండ్ సినిమా నాలుగు వందల రోజులు థియేటర్లో ప్రదర్శింపబడింది. తాజాగా శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న 'డిక్టేటర్' చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ చిత్రం ఆడియో విజయోత్సవం వేడుకలు హైదరాబాద్ లో జరిగాయి ఈ సందర్భంగా బాలకృష్ణ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.సంక్రాంతికి విడుదల కాబోతున్న చిత్రాలు సోగ్గాడే చిన్ని నాయనా ,ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో , శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజాలు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే..వీటిపై బాలయ్య తనదైన శైలిలో షాకింగ్ కామెంట్స్ చేశారు. నాకెవరూ పోటీ కాదు. నా కొడుకు వచ్చినా , మనవడు వచ్చినా సరే నేను సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. నాతోనే నేను పోటీ పడుతూ ఉంటాను తప్ప నాకెవరూ పోటీ కాదని అన్నారు. అయితే సినిమాల్లోనే పవర్ ఫుల్ పంచ్ డైలాగులు కొట్టే బాలయ్య ఈ సారి ఆడియే విజయోత్సవ వేడుకలు కాస్త ఘాటుగానే స్పందించారు. మరో వైపు కొన్ని రోజుల నుండి థీయేటర్ ల విషయంలో ఎన్టీఆర్, బాలయ్య చిత్రాలకు మద్య తీవ్ర పోరు సాగుతోందనే ప్రచారం జరుగోతోందనే సమాచారం తెలుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com