దర్శకుల సంఘానికి రూ.10 లక్షల విరాళం ఇచ్చిన హీరో సూర్య
- October 11, 2019తమిళ్ స్టార్ హీరో సూర్య మరోసారి తన గొప్ప మనసుని చాటుకొన్నారు. తమిళనాడు చలన చిత్ర దర్శకుల సంఘానికి నటుడు సూర్య రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. దర్శకుల సంఘం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సూర్య విరాళాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ చెక్కుని సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ వీ ఉదయకుమార్ కు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా సూర్యకు సంఘం అధ్యక్షుడు ఆర్ కే సెల్వమణి, కోశాధికారి పేరరసులు కృతజ్ఞతలు తెలియజేశారు.
సూర్య నటించిన బందోబస్త్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తమిళ్ లో ఓ మోస్తరుగా ఆడినా.. తెలుగులో మాత్రం పెద్దగా ఆడలేదు. ఇక సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన రావొచ్చని చెబుతున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..