'షార్’లో ప్రమాదం..రెండో వీఏబీ భవనంలో కూలిన ప్లాట్‌ఫామ్స్..రూ.2కోట్ల ఆస్తి నష్టం!
- October 15, 2019
నెల్లూరు: సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్‌లోని రెండో వాహన అనుసంధాన భవనంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాకెట్ పరికరాలు అనుసంధానం చేసే ప్లాట్ ఫారాలు కూలి రూ. 2కోట్ల నష్టం వాటిల్లిందని సమాచారం. త్రుటిలో ప్రాణ నష్టం తప్పిం ది. షార్‌లోని రెండో వీఏబీ భవనంలో రాకెట్ అనుసంధానం చేసే ఎఫ్‌సీవీఆర్‌పీ ప్లాట్ ఫారాలు న్నాయి. పరికరాలు మోసుకెళ్లే గేర్ బాక్స్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీనిని సరిచేసేప్పుడు అయిల్ లీకై రెండు ప్లాట్‌ఫారాలు కూలిపోయాయి. ప్రమాద సమయంలో సిబ్బంది టీ తాగేందుకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. షార్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ప్రమాదంపై విచారణకు ప్రత్యేక కమిటీని నియమించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







