'ITCA' ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు...

- October 15, 2019 , by Maagulf
'ITCA' ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు...

రోం:తేది 13 అక్టోబర్ 2019 ఆదివారం రోజున “ఇటలీ తెలుగు సాంస్కృతిక సంఘం (ITCA)” ఆధ్వర్యంలో “రోం” లోని కాళీమందిర్ దేవాలయ ప్రాంగణంలో సుమారు 250 మంది తెలుగు బిడ్డల నడుమ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా వరుసగా 3 వ సంవత్సరం "బతుకమ్మ సంబరాలు" ఎంతో అట్టహాసంగా జరిగాయి.

తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయలను ప్రతిబింబించే విధంగా ఆడపడుచులు సాంప్రదాయ దుస్తుల్లో పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరై బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా ఆడి పాడడంతో ఆలయ ప్రాంగణం అంతా పండగ వాతావరణంతో నిండిపోయింది.

ఇతర దేశాలకు చెందిన మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటలీలో దొరికే వివిద రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారుచేసి విదేశీవనితలు రోజంతా ఆడిపాడారు.

ఈ కార్యక్రమంలో ఈవెంట్ ఆర్గనైజర్స్ పిన్నమరెడ్డి సౌమ్యరెడ్డి, డా.రవితేజ, లోకిత పుంజాల, ITCA వ్యవస్థాపకులు కొక్కుల మనోజ్ కుమార్, కోపూరి మనూష మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.           

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com