ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టి తింటే బాగా నిద్రపడుతుంది
- October 16, 2019
ఖర్జూరాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉన్నాయి. వీటిల్లో కొలెస్ట్రాల్ ఉండదు. అలాగే కొవ్వు శాతం కూడా తక్కువే. పైగా తక్షణ శక్తి లభిస్తుంది. ఇవి ఇంకెలా మేలు చేస్తాయంటే..
ఖర్జూరాల్లో పొటాషియం, క్యాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఆ పోషకాలు ఎముకలను మేలు చేస్తాయి. చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అసిడిటీని అదుపులో ఉంచుతాయి. వీటిల్లోని పీచు అరుగుదలకు సాయపడుతుంది. ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టి తింటే చక్కగా నిద్రపడుతుంది.
ఎండు ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి ఉదయం ఏవైనా పండ్లతోపాటు తీసుకుంటే మలబద్ధకం సమస్య దరిచేరదు. బరువు పెరగాలనుకునే వారికి ఇది చక్కటి ఆహారం. వీటిలో ఇనుము శాతం కూడా ఎక్కువే. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనత దరిచేరదు.
విటమిన్లు, ఖనిజాలు మాంసకృత్తులు ఖర్జూరాల్లో సమృద్ధిగా లభిస్తాయి. రోజూ కనీసం నాలుగైదు తీసుకోవాలి. తీసుకున్న వెంటనే తక్షణ శక్తి అందుతుంది. అలసట దూరమవుతుంది. అందుకు ఖర్జూరాల్లోని గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్‌లు కారణం.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..