2020 మార్చిలో ఒమన్‌ రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌పో

- October 16, 2019 , by Maagulf
2020 మార్చిలో ఒమన్‌ రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌పో

మస్కట్‌: మూడవ ఒమన్‌ రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌పో (ఓఆర్‌ఇఎక్స్‌), మస్కట్‌లో వచ్చే ఏడాది జరగబోతోంది. ఒమన్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ ఇందుకు వేదిక కానుంది. మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఈ ఎక్స్‌పో జరుగుతుంది. ఒమన్‌ రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌పో ఆర్గనైజర్‌ అయిన ఒమన్‌ ఎక్స్‌పో ఈ విషయాన్ని వెల్లడించింది. ఒమన్‌ రియల్‌ స్టేట్‌ అసోసియేషన్‌, ఒమన్‌ రియల్‌ ఎస్టేట్‌ ఎగ్యులేటింగ్‌ బాడీ, రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ది మినిస్ట్రీ ఆఫ్‌ హౌసింగ్‌ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థానిక అంతర్జాతీయ ఇన్వెస్టర్స్‌కి ఈ రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌పో మంచి వేదిక అనీ, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అనుసరించాల్సిన సరికొత్త విధానాల గురించి ఎక్స్‌పో ఔత్సాహికులకు తెలియజేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com