ఈ ఏడాది “ముస్లిం సోదరుల హజ్ యాత్ర” అమరావతి నుంచే..
- October 18, 2019
అమరావతి: హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులు వచ్చే ఏడాది అమరావతి నుంచి యాత్ర మొదలవుతుందని ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో అనేక సంప్రదింపులు జరిపి హజ్ యాత్రను విజయవాడ నుంచి కొనసాగే విధంగా చర్యలు చేపట్టారని మంత్రి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని మూడో బ్లాకులో ఉన్న తన ఛాంబర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హజ్ యాత్ర 2020 బ్రోచర్, పోస్టర్‌ను ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆవిష్కరించారు. మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన హాజ్ కోటా కంటే తక్కువ మంది వెళ్తున్నారని, దీనిని అధిగమించి రాష్ట్రానికి కేటాయించిన 2,600 హాజీలతో పూర్తిస్థాయిలో ఈ కోటాను హాజీలు సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం విస్తృత స్థాయి ప్రచారం కల్పిస్తోందని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీ సోదరులకు హజ్ యాత్రకు ఆర్థిక సాయం అందించే విషయమై ఇచ్చిన హామీ మేరకు హజ్ యాత్రకు వెళ్లే హాజీ లకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలననే ఆదేశం మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లే హాజీ లకు మూడు లక్షల ఆదాయం కలిగి ఉన్నవారికి రూ.60 వేలు, మూడు లక్షల ఆదాయం పైబడిన వారికి రూ.30 వేల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని చెప్పారు. ఏపీ స్టేట్ హజ్ కమిటీల ద్వారా 13 జిల్లాల్లో హజ్ యాత్రకు వెళ్లేవారికి రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని, హాజ్ యాత్రపై విస్తృత ప్రచారం కల్పించి అధికమంది హజ్ యాత్రకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. హజ్ యాత్రకు వెళ్లే హాజీలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారం అందిపుచ్చుకొని ముస్లిం సోదరులు వినియోగించుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. హజ్ యాత్రకు వెళ్లే హాజీలు ఈ సంవత్సరం నవంబర్ 10వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని, హజ్ యాత్ర చేయడం ఫర్జ్ అని హజ్ యాత్రకు వెళ్లే స్థోమత ఉంటే హజ్ విధి నెరవేర్చాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైనార్టీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఇలియాస్ రిజ్వి, హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ అధికారులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







