అభిమానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన తలైవా..!
- October 19, 2019చెన్నై:సినీ తారలంటే అభిమానించే వారు ఎంతో మంది ఉంటారు. కొంత మంది స్టార్ హీరోలకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు వారం ముందు నుంచి సందడి చేస్తుంటారు. పెద్ద కటౌట్స్ పెట్టి పాలభిషేకాలు చేస్తుంటారు. తమిళనాట రజినీకి ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తమ దేవుడిగా కొలిచే వారు ఎంతో మంది ఉన్నారు. రజినీ తర్వాత ఆ స్థాయిలో విజయ్, అజిత్ లకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు.
ఇటీవల ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మద్య కోల్డ్ వార్ నడుస్తుంది. తాజాగా తమిళ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ హిమాలయాలకు వెళ్లిన విషయం తెలిసిందే. హిమాలయాల యాత్రకు వెళ్లిన ఆయన శుక్రవారం వచ్చారు. ఆయన రాకతో అభిమానుల్లో కోలాహలం నెలకొంది...రజినీ చుట్టు చేరి సెల్పీల కోసం ఎగబడ్డారు. తలైవా జిందాబాద్..ఐ లవ్ యూ అంటే కేకలు వేశారు. ఆ తర్వాత రజినీకాంత్ ఆయన కారు లో ఇంటికి వెళ్లిపోయారు..ఈ క్రమంలో ఓ అభిమాని బైక్ పై రజినీని ఫాలో అవుతూ ఆయన గెటు వరకు వెళ్లారు.
ఇది గమనించిన రజినీకాంత్ తన గార్డుతో ఆ అభిమానిని ఇంటిలోకి పిలిపించుకొని ఇలాంటి సమయంలో బైక్పై ప్రయాణం మంచిది కాదు. చాలా ప్రమాదకరమైంది. ఇంకెప్పుడూ ఇలా చెయ్యొద్దు అని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చి ఒక ఫొటో దిగి పంపారట.
తాజా వార్తలు
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు