గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కనున్న అయోధ్య..
- October 26, 2019
ఉత్తర్‌ప్రదేశ్:శ్రీరాముడు జన్మించిన అతి పవిత్రమైన అయోధ్య నగరం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. అసలు విషయానికొస్తే.. దీపావళిని పురస్కరించుకొని ఇవాళ సాయంత్రం అయోధ్యలో 5.51లక్షల మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించి ‘దీపోత్సవం’ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ దీపోత్సవాన్ని యూపీ సర్కారు రాష్ట్ర పండగగా ప్రకటించి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుండగా.. లక్షల దీపాలతో అయోధ్య నగరాన్ని అలంకరించాలని సీఎం యోగి నిర్ణయించారు. అద్భుతంగా కన్నుల పండుగ జరిగే ఈ దీపోత్సవానికి భక్తులు కూడా భారీగా తరలిరానున్నారు. దీని కోసం సీఎం ఆదిత్యానాథ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది.
ఇక ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఫీజీ రిపబ్లిక్ డిప్యూటీ స్పీకర్ వీణ భట్నాగల్, యూపీ మంత్రులు పాల్గొనున్నారు. అయోధ్య దీపోత్సవంలో ఈ ఉదయం 10 గంటల నుంచి ఊరేగింపు కూడా ప్రారంభమైంది. సాకేత్ కళాశాల నుంచి రామకథ పార్కు వరకు సాగనున్న ఈ ఊరేగింపులో దేశంలోని నలుమూలల నుంచి కళాకారులు పాల్గొన్నారు. సీతారాములను ఆరాధించడంతో పాటు రాముడి పట్టాభిషేకం సాగనుంది. రామలీలా కార్యక్రమంలో ఏడు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా రూ.226 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం యోగి ప్రారంభించనున్నారు. ఇక ఈ రాత్రి చేపట్టనున్న ‘దీపోత్సవం’ గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నిలవనుంది. కాగా 2018 లో యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం సరయు నదీ తీరంలో 3 లక్షల 150 మంటి మట్టి దీపాలను వెలిగించి ‘దీపోత్సవ’ వేడుకలు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







