విశాఖ నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- October 28, 2019
విశాఖపట్నం : దీపావళి పండగ వేళ విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం నుంచి మరో కొత్త సర్వీస్‌ను స్పైస్ జెట్ ప్రారంభించింది. విశాఖపట్నం-విజయవాడ మధ్య స్పైస్ జెట్ సర్వీసు ను విశాఖ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ లాంఛనంగా ప్రారంభించారు. స్పైస్‌జెట్ విమాన సంస్థ విశాఖ నుంచి గన్నవరానికి మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు పాటు సర్వీసులు నడపనుంది. వైజాగ్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి 9.50 గంటలకు బయలుదేరి 10.50కు వైజాగ్ చేరుకుంటుంది. నేటి నుంచి చెన్నై, సింగపూర్‌లకు కూడా నూతన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎన్నికల సమయంలో అనివార్య కారణాల వల్ల రద్దయిన విమాన సర్వీసుల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







