గ్లోబల్‌ విలేజ్‌.. తొలి రోజే పోటెత్తిన సందర్శకులు

- October 30, 2019 , by Maagulf
గ్లోబల్‌ విలేజ్‌.. తొలి రోజే పోటెత్తిన సందర్శకులు

వందలాదిమంది రెసిడెంట్స్‌, విజిటర్స్‌ గ్లోబల్‌ విలేజ్‌ ప్రారంభమయిన తొలి రోజే పోటెత్తారు. 159 రోజులపాటు ఈ గ్లోబల్‌ విలేజ్‌ సందర్శకులతో కిటకిటలాడనుంది. మొత్తంగా 40,000 షోస్‌, 3,500 ఔట్‌లెట్స్‌, 100కి పైగా రైడ్స్‌, స్కిల్‌ గేమ్స్‌, ఆర్కేడ్‌ గేమ్స్‌ మౌత్‌ వాటరింగ్‌ కజిన్‌.. ఇలా చాలా ఆకర్షణలు ఇక్కడ కొలువుదీరాయి. 2020 ఏప్రిల్‌ 4 వరకు ఈ గ్లోబల్‌ విలేజ్‌ కొనసాగుతుంది. 78 దేశాలకు చెందిన సంస్కృతీ సంప్రదాయాలు ఇక్కడ కొలువుదీరుతున్నాయి. యూఏఈ, సౌదీ అరేబియా, పాకిస్తాన్‌, ఇండియా, యూరోప్‌, అమెరికాస్‌, బోస్నియా మరియు బాల్కాన్స్‌, థాయిలాండ్‌, బహ్రెయిన్‌ మరియు కువైట్‌, లెబనాన్‌, పాలస్తీనా మరియు జోర్డాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, సిరియా, జపాన్‌, ఫిలిప్పీన్స్‌ మరియు వియెత్నాం, చైనా, ఆఫ్రికా, ఈజిప్ట్‌, మొరాకో, టర్కీ, ఇరాన్‌ మరియు యెమెన్‌ తదితర దేశాల ప్రాతినిథ్యం ఈ గ్లోబల్‌ విలేజ్‌లో కన్పిస్తుంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com