తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

- November 04, 2019 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామా స్మరణతో శైవక్షేత్రాలు మార్మోగిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని శ్రీశైలం పుణ్య క్షేత్రానికి భక్తుల రద్దీ అధికంగా ఉంది. మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణలోని కాళేశ్వర ముక్తీశ్వరాలయం, వరంగల్ వేయిస్థంభాలగుడి, చెర్వుగట్టు, యాదాద్రిలోని శివాలయాకు భక్తుల బారులు తీరారు. సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస సందడి నెలకొంది. కార్తీక మాసోత్సవం సోమవారం ఉదయం గర్భాలయంలోని మూలవిరాట్‌కు శ్రీ మహన్యాస పూర్వక రుద్రాభిషేకంతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో మొదటి సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక దీపాలను వెలిగించి స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com