జెడ్డా నుంచి హైదరాబాద్‌ విమానం 13గంటల ఆలస్యం..

- November 04, 2019 , by Maagulf
జెడ్డా నుంచి హైదరాబాద్‌ విమానం 13గంటల ఆలస్యం..

జెడ్డా: సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన ఓ ఎయిరిండియా విమానం ఆలస్యం అవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విమానంలో 300 మంది ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.ఎందుకంటే ఆ విమానం ఆలస్యమైంది గంటో రెండు గంటలో కాదు, ఏకంగా 13గంటలు. అంటే శనివారం రాత్రి 11.15గంటలకు బయల్దేరాల్సిన విమానం.. ఆదివారం మధ్యాహ్నం 12.15కు బయల్దేరింది. విమానం టైం అయిపోతుందని ఓ గంట ముందుగానే ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రయాణికులకు ఈ వార్త చిరాకు తెప్పించింది. దీంతో వారు ఎయిరిండియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో స్వదేశానికి బయల్దేరిన ప్రవాసీలు, ఉమ్రా తీర్థయాత్రలకు వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు.వికెఎస్ మీనన్ అనే ప్రయాణికుడు మాట్లాడుతూ తన భార్య మరియు అతని వృద్ధ అత్తగారితో కలిసి హైదరాబాద్ కు  వెళుతున్న, విమానం అతిగా ఆలస్యం చేసినందుకు ఎయిర్లైన్స్ సిబ్బంది ముందుకు రావడం లేదని చెప్పారు.

దీనిపై స్పందించిన ఎయిరిండియా ప్రతినిధులు 'జెడ్డా నుంచి హైదరాబాద్ వెళ్లే ఏఐ966 విమానం నడపాల్సిన సిబ్బంది న్యూఢిల్లీ నుంచి కోచికి చేరుకుంటారు. అక్కడి నుంచి జెడ్డా రావాలి. కోచి నుంచి వారు రావడం ఆలస్యం అయింది. దాని వల్లే జెడ్డా నుంచి బయల్దేరే విమానం కూడా ఆలస్యమైంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం' అంటూ వివరణ ఇచ్చారు. కాగా, హైదరాబాద్ వెళ్లడం కోసం వచ్చిన వృద్ధులు, మహిళలు ఈ ఆలస్యం కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని ప్రయాణికులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com