జెడ్డా నుంచి హైదరాబాద్ విమానం 13గంటల ఆలస్యం..
- November 04, 2019
జెడ్డా: సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన ఓ ఎయిరిండియా విమానం ఆలస్యం అవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విమానంలో 300 మంది ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.ఎందుకంటే ఆ విమానం ఆలస్యమైంది గంటో రెండు గంటలో కాదు, ఏకంగా 13గంటలు. అంటే శనివారం రాత్రి 11.15గంటలకు బయల్దేరాల్సిన విమానం.. ఆదివారం మధ్యాహ్నం 12.15కు బయల్దేరింది. విమానం టైం అయిపోతుందని ఓ గంట ముందుగానే ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రయాణికులకు ఈ వార్త చిరాకు తెప్పించింది. దీంతో వారు ఎయిరిండియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో స్వదేశానికి బయల్దేరిన ప్రవాసీలు, ఉమ్రా తీర్థయాత్రలకు వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు.వికెఎస్ మీనన్ అనే ప్రయాణికుడు మాట్లాడుతూ తన భార్య మరియు అతని వృద్ధ అత్తగారితో కలిసి హైదరాబాద్ కు వెళుతున్న, విమానం అతిగా ఆలస్యం చేసినందుకు ఎయిర్‌లైన్స్ సిబ్బంది ముందుకు రావడం లేదని చెప్పారు.
దీనిపై స్పందించిన ఎయిరిండియా ప్రతినిధులు 'జెడ్డా నుంచి హైదరాబాద్ వెళ్లే ఏఐ966 విమానం నడపాల్సిన సిబ్బంది న్యూఢిల్లీ నుంచి కోచికి చేరుకుంటారు. అక్కడి నుంచి జెడ్డా రావాలి. కోచి నుంచి వారు రావడం ఆలస్యం అయింది. దాని వల్లే జెడ్డా నుంచి బయల్దేరే విమానం కూడా ఆలస్యమైంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం' అంటూ వివరణ ఇచ్చారు. కాగా, హైదరాబాద్ వెళ్లడం కోసం వచ్చిన వృద్ధులు, మహిళలు ఈ ఆలస్యం కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని ప్రయాణికులు తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!