పాక్ అధికారికంగా విడుదల చేసిన వీడియో..ఇదేదో రహస్య ఎజెండా అని అంటున్న పంజాబ్ ముఖ్యమంత్రి

- November 06, 2019 , by Maagulf
పాక్ అధికారికంగా విడుదల చేసిన వీడియో..ఇదేదో రహస్య ఎజెండా అని అంటున్న పంజాబ్ ముఖ్యమంత్రి

ఛండీగఢ్: కర్తార్‌పూర్ కారిడార్ విషయంలో పాకిస్థాన్ హడావిడి నిర్ణయం వెనుక ఏదో బలవత్తరమైన కారణం ఉందని ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇవాళ తన వాదనను పునరుద్ఘాటించారు.

బుధవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, కర్తార్‌పూర్ కారిడార్‌కు యాత్రికులను ఆహ్వానిస్తూ పాక్ అధికారికంగా విడుదల చేసిన వీడియో సాంగ్‌లో ఖలిస్థాన్ వేర్పాటువాది జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలే చిత్రం చోటుచేసుందన్నారు. 'పాకిస్థాన్‌కు రహస్య ఎజెండా ఉందని నేను మొదట్నించి హెచ్చరిస్తూనే ఉన్నాను' అని ఆయన అన్నారు. పాక్ అధికార వీడియాతో తన అనుమానాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. కాగా, దీనికి ముందు ఛండీగఢ్‌లో కర్తార్‌పూర్ కారిడార్ అధికార వీడియోసాంగ్‌ విడుదల కార్యక్రమంలో అమరీందర్ సింగ్, హర్యానా మాజీ సీఎం బీఎస్ హుడా, పంజాబ్ మాజీ మఖ్యమ్తరి ప్రకాష్ సింగ్ బాదల్, హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా పాల్గొన్నారు.

పాక్ వీడియాలో ఏముందంటే.. మరోవైపు, వివాదం సృష్టిస్తున్న పాక్ (కర్తార్‌పూర్) అధికార వీడియో సాంగ్‌ను ఆదేశ సమచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారంనాడు విడుదల చేసింది. 1984లో పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంలో భారత ఆర్మీ చేపట్టిన 'బ్లూస్టార్ ఆపరేషన్‌'లో మరణించిన బింద్రన్‌వాలే, మేజర్ జనరల్ షాబెగ్ సింగ్, అమ్రిక్ సింగ్ ఖల్సా పోస్టర్లు ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తున్నారు. దీంతో ఇది పాక్ ఉద్దేశపూర్వక చర్యగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్తార్‌పూర్ యాత్ర మాటున పంజాబ్‌లో మరోసారి ఖలిస్థాన్ వేర్పాటువాదానికి పాక్ ఊపిరిపోసే ప్రయత్నాలు చేస్తోందన్న అనుమానాలకు సైతం తావిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com