భారత్ దేశం లో దాడికి యత్నించిన ఐసిస్
- November 06, 2019
వాషింగ్టన్: ఒకప్పుడు ఐసిస్ ఉగ్రవాదసంస్థ సిరియా, ఆఫ్ఘానిస్థాన్ వంటి కొన్ని దేశాలకే పరిమితం చేస్తూ దాడులు చేసేవి. అయితే భారత్ వంటి దేశాన్ని కూడా టర్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తున్నది. ఇదే విషయాన్ని అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ గత సంవత్సరం భారత్‌లోనూ దాడులకు యత్నించిందని ఆయన చెప్పారు. కానీ, వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయన్నారు. ఐసిస్‌కు చెందిన భొరసన్ గ్రూప్ (ఐసిస్-కె) ఈ మేరకు ప్రణాళికలు రచించిందని అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ రస్సెల్ ట్రావర్స్ వెల్లడించారు. భారత సంతతికి చెందిన సెనెటర్ మ్యాగీ హాసన్ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఐసిస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థల్లో 'ఐసిస్-కెనే అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు. ఇన్నాళ్లు కేవలం ఆప్ఘానిస్థాన్పైనే గురిపెట్టిన ఈ సంస్థ గత సంవత్సరం ఇతర ప్రాంతాలకూ తన ప్రణాళికలు విస్తరించిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్‌కు అనుబంధంగా 20 గ్రూపులు పనిచేస్తున్నాయని గతవారం ట్రావర్స్ ఓ సందర్భంలో తెలిపారు. వీటిలో కొన్ని దాడులకు డ్రోన్లాంటి అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయని వెల్లడించారు. సిరియా, ఇరాక్‌లో ఐసిస్‌ని పూర్తిగా తుడిచిపెట్టినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వి
స్తరించిన దాని మూలాలు అమెరికాకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!