దుబాయ్:పేషెంట్‌పై ఫిజియో అసభ్యకర ప్రవర్తన
- November 06, 2019దుబాయ్:ఆసియాకి చెందిన ఫిజియోథెరపిస్ట్, 45 ఏళ్ళ మహిళా పేషెంట్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతన్ని డిపోర్ట్ చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 38 ఏళ్ళ హెల్త్ వర్కర్, మహిళా పేషెంట్‌ని ముద్దాడేందుకు ప్రయత్నించాడు. మహిళ శరీరాన్ని అసభ్యకరంగా తాకాడు కూడా. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మే నెలలో ఓ ఫిజియోథెరపీ సెషన్ సందర్భంగా ఇది జరిగినట్లు బాధితురాలు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష, డిపోర్టేషన్ విధించింది క్రిమినల్ కోర్ట్. బాధితురాలు బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు కోర్డు రికార్డులు చెబుతున్నాయి. కాగా, నిందితుడు తనకు న్యాయస్థానం విధించిన శిక్షను కోర్ట్ ఆఫ్ అప్పీల్లో సవాల్ చేయగా, జైలు శిక్ష రద్దు చేసిన న్యాయస్థానం, డిపోర్టేషన్‌ని మాత్రం సమర్థించింది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..