దుబాయ్:పేషెంట్‌పై ఫిజియో అసభ్యకర ప్రవర్తన
- November 06, 2019
దుబాయ్:ఆసియాకి చెందిన ఫిజియోథెరపిస్ట్, 45 ఏళ్ళ మహిళా పేషెంట్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతన్ని డిపోర్ట్ చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 38 ఏళ్ళ హెల్త్ వర్కర్, మహిళా పేషెంట్‌ని ముద్దాడేందుకు ప్రయత్నించాడు. మహిళ శరీరాన్ని అసభ్యకరంగా తాకాడు కూడా. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మే నెలలో ఓ ఫిజియోథెరపీ సెషన్ సందర్భంగా ఇది జరిగినట్లు బాధితురాలు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష, డిపోర్టేషన్ విధించింది క్రిమినల్ కోర్ట్. బాధితురాలు బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు కోర్డు రికార్డులు చెబుతున్నాయి. కాగా, నిందితుడు తనకు న్యాయస్థానం విధించిన శిక్షను కోర్ట్ ఆఫ్ అప్పీల్‌లో సవాల్ చేయగా, జైలు శిక్ష రద్దు చేసిన న్యాయస్థానం, డిపోర్టేషన్‌ని మాత్రం సమర్థించింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







