షార్జాలో అతి పెద్ద బుక్‌ ఎగ్జిబిషన్‌

- November 09, 2019 , by Maagulf
షార్జాలో అతి పెద్ద బుక్‌ ఎగ్జిబిషన్‌

యూఏఈ: షార్జా ఇంటర్నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌ (ఎస్‌బిఐఎఫ్‌)లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన 1,502 ఆథర్స్‌ చరిత్ర సృష్టించారు. సరికొత్త గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌కి ఈ ఈవెంట్‌ వేదిక అయ్యింది. 'వరల్డ్స్‌ లర్జెస్ట్‌ బుక్‌ సైనింగ్‌ సెర్మానీ' ఒకే వేదికపై గతంలో 1,423 మంది ఆదర్స్‌తో జరగగా, ఇప్పుడు 1,502 మందితో ఆ కార్యక్రమం జరిగింది. దాంతో, ఈ ఘటన గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌కి ఎక్కింది. ఎస్‌బిఎ ఛైర్మన్‌ అహ్మద్‌ బిన్‌ రక్కాద్‌ అల్‌ అమెరి మాట్లాడుతూ, షార్జా ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో తన ప్రత్యేకతను చాటుకుంటోందనీ, ఈసారి ఈ విభాగంలో షార్జాకి ఘనత దక్కడం ఆనందంగా వుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆదర్స్‌, పబ్లిషర్స్‌ మరియు వాలంటీర్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com