వీల్ ఛెయిర్‌పై దుబాయ్ రన్ చేసిన సీనియర్ సిటిజన్స్
- November 09, 2019
శుక్రవారం జరిగిన దుబాయ్ రన్‌లో యువకులే కాదు, వృద్ధులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. 86 ఏళ్ళ భారత మహిళ కుసుమ్ భార్గవ, వీల్ ఛెయిర్‌పై పరుగులో పాల్గొనడం గమనార్హం. ఇది చాలా గొప్ప అనుభూతి అనీ, చాలామందిని తాను కలుసుకున్నానని ఆమె చెప్పారు. వీల్ ఛెయిర్‌పై 5 కిలోమీటర్ల రన్‌ని ఆమె పూర్తి చేశారు. 78 ఏళ్ళ ఈశ్వరి అమ్మ, తన కుమారులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి 5 కిలోమీటర్ల రన్‌లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు ఆమెను వీల్ ఛెయిర్‌పై నడిపించారు. తన కుమారుడు దుబాయ్‌లోని అద్భుతమైన కట్టడాల్ని చూపించేవాడనీ, ఇప్పుడు ఇంతమందిని ఒకేసారి రోడ్డుపై చూస్తున్నానని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







