తీరం దాటిన బుల్‌బల్‌.. ఏపికి భారీ వర్షాలు

- November 10, 2019 , by Maagulf
తీరం దాటిన బుల్‌బల్‌.. ఏపికి భారీ వర్షాలు

విశాఖ: బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్‌బుల్‌ తుఫాను తీరం దాటింది. ఈ తుఫాను పశ్చిమ బెంగాళ్‌-బంగ్లాదేశ్‌ మీదుగా తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను దాటికి ఏపిలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నదని, మత్స్యకారులను వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫాను ప్రభావంతో పారాదీప్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా తీరాల్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పశ్చిమ బెంగాల్‌ ఒడిశా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com