హీరోగా గల్లా అశోక్..క్లాప్ కొట్టి ఆరంభించిన రామ్ చరణ్
- November 10, 2019



ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ కథానాయకుడిగా రూపొందనున్న తొలి సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో ఈ శుభకార్యానికి వేదికైంది. ఈ కార్యక్రమానికి గల్లా కుటుంబ సభ్యులతోపాటు సినీ ప్రముఖులు కృష్ణ, నరేశ్, రామ్ చరణ్, రానా తదితరులు హాజరై సందడి చేశారు. ముహూర్తపు సన్నివేశానికి రామ్ చరణ్ క్లాప్ కొట్టారు. గల్లా జయదేవ్ దంపతులు, గల్లా అరుణకుమారి, కృష్ణ కలిసి స్క్రిప్టును దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు అందించారు.
'భలే మంచి రోజు', 'శమంతకమణి', 'దేవదాస్' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' ఫేం నిధి అగర్వాల్ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. జిబ్రాన్ బాణీలు అందిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గల్లా పద్మావతి నిర్మాత సూపర్‌స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి కలిసి సినిమాను సమర్పిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్









