పాక్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ..అంతరార్ధం ఏంటో!
- November 11, 2019
అభినందన్ వర్థమాన్.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని వ్యక్తి. పాకిస్థాన్‌పై ఎంతో ధైర్యంతో దాడి చేసి పాకిస్థాన్ నుంచి సేఫ్‌గా బయటకు వచ్చిన వ్యక్తి. మళ్లీ ఇప్పుడు ఈయన ప్రస్తావన ఎందుకొచ్చిందంటే పాకిస్థాన్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ ప్రత్యక్ష్యమయ్యింది. ఏంటి షాక్ అయ్యారా..? మీరు వింటున్నది నిజమే..!
భారత వాయుసేన పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ బొమ్మను కరాచీలోని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియంలో పెట్టారు. ఎందుకు పెట్టారో, ఏమిటో తెలీదు కానీ ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. అక్కడి జర్నలిస్ట్ అన్వర్ లోధి, అభినందన్ ఫొటోను తీసి తన ట్విట్టర్‌లొ పోస్ట్ చేశాడు. అన్వర్ ట్వీట్ చేస్తూ, అభినందన్ బొమ్మను పెడుతూ అతని చేతిలో టీ కప్పు కూడా పెడితే ఇంకా బాగుండేదని ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 27న అభినందన్ పాక్ సైన్యానికి పట్టుబడిన సంగతి తెలిసిందే. మిగ్-21 విమానాన్ని నడుపుకుంటూ పొరపాటున పాక్ గగనతలంలోకి ప్రవేశించగా దాన్ని కూల్చి వేశాయి పాక్ దళాలు. మొదట అందరూ అభినందన్ చనిపోయాడని అనుకున్నా అతన్ని బంధీగా పట్టుకున్నాయి పాక్ దళాలు. నానా చిత్ర హింసలు పెడుతూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. అప్పుడు దీనిపై ప్రపంచ వ్యాప్తంగా రచ్చరచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం వివిధ దేశాల నుంచి కూడా ఒత్తిడి ఎక్కువగా రావడంతో మార్చి 1న అతన్ని ఇండియాకు అప్పగించారు పాక్ సైనికులు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







