క్యూబాపై దిగ్బంధాన్ని వ్యతిరేకించిన 187 దేశాలు

- November 11, 2019 , by Maagulf
క్యూబాపై దిగ్బంధాన్ని వ్యతిరేకించిన 187 దేశాలు

ఐక్యరాజ్యసమితి: ఐరాస జనరల్‌ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 187 దేశాలు గత ఆరున్నర దశాబ్దాలుగా క్యూబాపై అమెరికా కొనసాగిస్తున్న ఆర్థిక, వాణిజ్య దిగ్బంధానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. క్యూబాపై అమెరికా అన్యాయంగా కొనసాగిస్తున్న ఆర్థిక, వాణిజ్య దిగ్బంధాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఈ దేశాలు కుండబద్దలు కొట్టాయి. క్యూబా ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవన పరిస్థితులను ధ్వంసం చేసేందుకు ట్రంప్‌ సర్కారు కూడా ఇప్పటి వరకూ 187 చర్యలను చేపట్టటం గమనార్హం. జనరల్‌ అసెంబ్లీలో ఈ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయిల్‌, బ్రెజిల్‌ దేశాలు ఓటు చేశాయి. కొలంబియా, ఉక్రెయిన్‌ దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. ఈ ఓటింగ్‌పై స్పందించిన క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ క్యూబాకు ఓటు వేయటం అంటే ప్రజల ఊచకోత కొనసాగింపును సమర్ధించటమేనని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. అమెరికా కొనసాగిస్తున్న ఆర్థిక దిగ్బంధానికి వ్యతిరేకంగా జనరల్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని 187 దేశాలు సమర్ధించటం తాము సాధించిన ఘన విజయమని ఆయన తన ట్వీట్‌లో అభివర్ణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com