కొత్త చమురు క్షేత్రాన్ని కనుగొన్న ఇరాన్
- November 11, 2019
టెహ్రాన్ : 53 బిలియన్ బ్యారెళ్ల ముడి చమురు వనరులు కలిగిన కొత్త చమురు క్షేత్రాన్ని ఇరాన్ కనుగొన గలిగిందని, దీనివల్ల ఇరాన్ చమురు నిల్వలు మూడోవంతు పెరుగుతాయని ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహానీ వెల్లడించారు. ఖుజెస్థాన్ ప్రావిన్స్ నైరుతి దిశగా 2400 చదరపు కిలో మీటర్ల పరిధిలో ఈ కొత్త చమురు క్షేత్రం విస్తరించి ఉందని చెప్పారు. ఇరాన్ ప్రజలకు ప్రభుత్వం అందించిన చిరుకానుకగా దీన్ని అభివర్ణించారు. ఇరాక్ సరిహద్దు లోని ఒమిడియె పట్టణానికి 200 కిమీ దూరంలో 80 మీటర్ల లోతున ఈ క్షేత్రం విస్తరించి ఉందని తెలిపారు.
ఒపెక్ సభ్య దేశాల చమురు నిల్వలకు ఈ కొత్త క్షేత్రం 34 శాతం అంటే 155.6 బిలియన్ బ్యారెళ్ల ముడి చమురును అదనంగా సమకూర్చగలదని చెప్పారు. ఒపెక్ (ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ) సంస్థాపక సభ్య దేశమైన ఇరాన్ ప్రపంచంలో నాలుగో వంతు చమురు నిల్వలు, రెండో వంతు గ్యాస్ నిల్వలు కలిగి ఉంది. 2015లో అణు ఒప్పందం నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైదొలగడమే కాకుండా ఇరాన్‌పై ఏక పక్షంగా ఆంక్షలు విధించడంతో తన చమురు నిల్వలను ఇతర దేశాలకు విక్రయించడానికి ఇబ్బందులు పడుతోంది. అయితే ఒప్పందం లోని మిగతా దేశాలు బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ రష్యా అమెరికా ఆంక్షలను పక్కన పెట్టి ఒప్పందాన్ని రక్షించుకోడానికి ప్రయత్నిస్తున్నాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!