10 డిగ్రీలకు దిగువన పడిపోయిన ఉష్ణోగ్రతలు

10 డిగ్రీలకు దిగువన పడిపోయిన ఉష్ణోగ్రతలు

యూఏఈ: నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ మిటియరాలజీ (ఎన్‌సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం, ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 9.5 డిగ్రీలీ సెంటీగ్రేడ్‌ నమోదయ్యింది. జైస్‌ మైంటెయిన్స్‌ వద్ద ఈ రోజు తెల్లవారుఝామున 4.45 నిమిషాలకు ఈ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇంటీరియర్‌ రీజియన్స్‌లో 29 నుంచి 34 డిగ్రీల వరకు, కోస్ట్‌ ఏరియాస్‌లో 28 నుంచి 33 డిగ్రీల వరకు, మౌంటెయిన్స్‌లో 21 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు నమోదు కానున్నాయి. కోస్టల్‌ ఏరియాస్‌లో అత్యధికంగా 65 నుంచి 85 శాతం హ్యుమిడిటీ నమోదవుతుంది. ఇంటీరియర్‌ రీజియన్స్‌లో దాదాపు ఇదే విధంగా వుంటుంది. మౌంటెయిన్స్‌లో 55 నుంచి 70 శాతం హ్యుమిడిటీ నమోదయ్యే అవకాశాలున్నాయి. వెస్టర్న్‌ ఏరియాస్‌లో మేఘాలు కనిపించవచ్చు. సముద్రం కొంత మేర రఫ్‌గా వుంటుంది.

 

Back to Top