నవాజ్ షరీఫ్ కు పాకిస్థాన్ సర్కారు షరతులు
- November 13, 2019పాకిస్థాన్: పాకిస్థాన్ సర్కారు చేసిన ప్రతిపాదనను ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తిరస్కరించారు. వైద్యచికిత్స చేయించుకోవాలని పాక్ సర్కారు చేసిన ప్రతిపాదనను నవాజ్ షరీఫ్ తోసిపుచ్చారు. వైద్యచికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు నవాజ్ షరీఫ్ కు పాక్ సర్కారు షరతులు విధించింది. నవాజ్ షరీఫ్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లాలంటే 7 బిలియన్ల పాక్ రూపాయలను డిపాజిట్ చేసి పూచికత్తు పొందాలని పాక్ సర్కారు ఆదేశించింది. చికిత్స అనంతరం తిరిగి స్వదేశానికి వచ్చాక నవాజ్ షరీఫ్ కోర్టు విచారణను ఎదుర్కోవాలని సర్కారు పేర్కొంది. వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు కూడా నవాజ్ షరీఫ్ కు పాక్ సర్కారు షరతులు విధించడంతో, తాను విదేశాలకు వెళ్లేది లేదని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. తాను బెయిలు కోసం పూచీకత్తు కోర్టుకు ఇప్పటికే సమర్పించానని, కానీ పాక్ సర్కారు విధిస్తున్న షరతులు న్యాయానికి విరుద్ధమని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారని అతని సోదరుడు పీఎంఎల్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ చెప్పారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు