రోడ్డు ప్రమాదంలో ప్లే బ్యాక్ సింగర్ మృతి
- November 15, 2019
మహారాష్ట్ర:మరాఠీ ప్లే బ్యాక్ సింగర్ గీతా మాలీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం రోజు తన స్వస్థలమైన నాసిక్‌కి కారులో వెళుతుండగా ముంబై-ఆగ్రా హైవేపై ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటెయినర్‌ని గీతా మాలీ కారు ఢీకొట్టగా, గీతా, ఆమె భర్త తీవ్రగాయాలపాలయ్యారు. వెంటనే వారిని షాపూర్ రూరల్ ఆసుపత్రికి తరలించారు. చికత్స పొందుతూ గీత మృతి చెందారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గీతా మరాఠీలో పలు సినిమా పాటలతో పాటు ఆల్బమ్స్‌కి కూడా పాడింది. ఆమె మృతికి మరాఠీ సినీ పరిశ్రమ సంతాపం తెలియజేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..