వీధుల్లో వేధిస్తే... షార్జాలో జరిమానాలు

- January 13, 2016 , by Maagulf
వీధుల్లో వేధిస్తే... షార్జాలో జరిమానాలు

తమ దుకాణాల్లో కొనమని వీధుల్లో వినియోగదారులను వెంటబడి వేధిస్తే , అటువంటి వ్యాపారస్తులపై షార్జా మునిసిపాలిటి జరిమానాలను విధించనుంది. వినియోగాదారులనే కాక, ఆ వీధుల్లో వెళ్ళే సాధారణ పౌరులను సైతం వదలక తమ గుమాస్తాలతో సతాయించేవారిపై సైతం ఇక చర్యలు తీసుకోనున్నారు. జరిమానాను  500 దినార్లగా నిర్ణయించారు. ఇదే తప్పును మరల పునరావృతం చేసిన వ్యాపారులకు అదే జరిమానా రెట్టింపు కానుంది. కొందఱు వ్యాపారులు చేస్తున్న ఈ తంతు విషయమై పలువురు వినియోగదారులు షార్జా మునిసిపాలిటి అధికారులకు పలు పిర్యాదులు ఇచ్చారు.ఇందుకు స్పందించిన షార్జా కేంద్ర మార్కెట్ విభాగాధిపతి ఆబ్దుల్లహ్ ఎబ్రహిం హస్సన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన    '  ఖలీజ్ టైమ్స్ ' తో  మాట్లాడుతూ, వినియోగదారులకు మార్కెట్లో ఏమేమీ 

 కొనుక్కోవాలో తెలుసునని...వారిని వ్యాపారస్తులు తమ ఉత్పతిని కొనమని , తమ వద్ద ఉన్న వస్తువు ఎంతో మంచిదని నమ్మబలకతు వేధించడం ఏ మాత్రం తగదని ఆయన వ్యాపారులను హెచ్చరించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com