కెరీర్‌ ఎక్స్‌పోలో 2,000కి పైగా ఉద్యోగావకాశాలు

- November 16, 2019 , by Maagulf
కెరీర్‌ ఎక్స్‌పోలో 2,000కి పైగా ఉద్యోగావకాశాలు

బహ్రెయిన్: వచ్చే నెలలో జరగనున్న కెరీర్‌ ఎక్స్‌పో 2000కి పైగా ఉద్యోగావకాశాలతో ఔత్సాహికుల్ని ఆకర్షించనుందని మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ వెల్లడించింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆప్‌ లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ అండర్‌ సెక్రెటరీ సబాహ్‌ అల్‌ దోసారి మాట్లాడుతూ, డిసెంబర్‌లో జరిగే జాబ్‌ ఫెయిర్‌ కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఈ ఈవెంట్‌ జరగనుంది. ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తోన్న ఔత్సాహికులు, ఈ ఎక్స్‌పోకి హాజరై, ఉద్యోగాల కోసం అప్లికేషన్స్‌ పెట్టుకోవచ్చని అన్నారు. ప్రముఖ కంపెనీలు ఈవెంట్‌ ద్వారా తమ సంస్థల్లో ఉద్యోగాల్ని కల్పించబోతున్నట్లు వివరించారాయన. నిరుద్యోగాన్ని తగ్గించేందుకోసం మినిస్ట్రీ చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో ఇదొకటని నబాహ్‌ అల్‌ దోసారి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com