ప్రపంచ రికార్డు వేటలో సౌదీ విమెన్ డ్రైవర్స్
- November 16, 2019
సౌదీ అరేబియా:వందలాది మంది సౌదీ విమెన్ డ్రైవర్స్, రియాద్‌లోని సౌదీ డ్రైవింగ్ స్కూల్ ప్రాంతంలో కార్లతో సందడి చేశారు. అతి పెద్ద విమెన్ కార్ కాన్వాయ్‌కి సంబంధించి ప్రపంచ రికార్డ్ కొల్లగొట్టేందుకు వీరంతా ఈ ప్రయత్నం చేశారు. టీవీ 'డ్రైవ్' మాజీ హోస్ట్ సజా కమల్ బ్రీఫింగ్‌తో మహిళా డ్రైవర్లు రంగంలోకి దిగారు. సీట్ బెల్ట్ ధరించి, ప్రిన్సెస్ నౌరా బింట్ అబ్దుల్ రహ్మాన్ యూనివర్సిటీని చుట్టేశారు వారంతా కాన్వాయ్‌గా. టొయోటా సంస్థ ఈ 100 కార్ల కాన్వాయ్‌ని నిర్వహించింది. సౌదీ ఫార్ములా ఇ స్టార్ మరియు మోటర్ స్పోర్ట్ ఔత్సాహికుడు అసీల్ అల్ హమాద్ ఈ కాన్వాయ్‌కి నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా వుందని పార్టిసిపెంట్స్ చెప్పారు. నిర్వాహకులు, తాము అనుకున్నది సాధించగలిగామనీ, అధికారిక రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నామని వివరించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







