సౌదీలో ఉన్మాది వీరంగం..ముగ్గురు స్టేజీ డ్యాన్సర్లపై కత్తితో దాడి
- November 17, 2019రియాద్ : సౌదీ అరేబియాలో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. స్టేజీపై నృత్యాలు ప్రదర్శిస్తున్న ముగ్గురు డ్యాన్సర్లపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితున్ని అదుపులోకి తీసుకున్నాయి. గాయపడ్డ డ్యాన్సర్లను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో పెను ప్రమాదం తప్పింది. డ్యాన్సర్లపై ఉన్మాది దాడికి పాల్పడ్డ కారణం తెలియరాలేదు. కాగా, సౌదీ యువరాజు సల్మాన్ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మహిళలకు స్వేచ్ఛ కల్పించాలనే ఉద్దేశంతో విదేశీ ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. మహిళలు కూడా పురుషులతో సమానంగా కార్లు డ్రైవింగ్ చేయొచ్చని ప్రకటించారు. వినోదం కోసం మూతపడ్డ సినిమా థియేటర్లను మళ్లీ తెరిపించారు. 2030నాటికి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు