పాకిస్తాన్ అదుపులో తెలుగు వ్యక్తి
- November 19, 2019
హైదరాబాద్: తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారంటూ ఇద్దరు భారతీయులను పాకిస్థాన్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిలాల్ కాగా, మరొకరు విశాఖపట్టణానికి చెందిన ప్రశాంత్ వైందంగా గుర్తించారు. పాస్‌పోర్టు, వీసా లేకుండా వీరు తమ దేశంలోకి ప్రవేశించినట్టు పాక్ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 14న వీరిని బహావుల్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వీరిద్దరిపైన అక్కడి చట్టంలోని 3344 కింద అభియోగాలు నమోదయ్యాయి. రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతంలో వీచే బలమైన గాలుల వల్ల భారత్-పాక్ సరిహద్దు వెంబడి ఉన్న కంచె కొన్నిసార్లు కనిపించదని, దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు పొరపాటు పడి సరిహద్దు దాటుతుంటారని భారత అధికారులు తెలిపారు. తాజా ఘటనలోనూ అదే జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
మరోవైపు, అక్కడి మీడియా మాత్రం వీరిపై అనుమానపు కథనాలు రాసింది. పాక్ అదుపులో ఉన్న ఇద్దరిలో ఒకరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని, అధునాతన ఉగ్రదాడి చేసేందుకు వీరిని పంపించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాసుకొచ్చింది. ఆగస్టులో రాజు లక్ష్మణ్ అనే భారత గూఢచారిని పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో అరెస్ట్ చేసినట్టు ఈ సందర్భంగా పేర్కొంది. కాగా, ఈ వ్యవహారంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇప్పటి వరకు స్పందించలేదు.
తాజా వార్తలు
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!







