ఢిల్లీ వెళ్లే విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏసియా ఆఫర్
- November 20, 2019
న్యూఢిల్లీ : ఢిల్లీ వెళ్లే విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏసియా శుభవార్త వెల్లడించింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కాలుష్యం కమ్ముకున్న నేపథ్యంలో ఎయిర్ ఏసియా ఢిల్లీకి ప్రయాణిస్తున్న తన విమాన ప్రయాణికులకు యాంటీ పొల్యూషన్ మాస్క్‌లను పంపిణీ చేస్తోంది. హైదరాబాద్ నగరంతోపాటు ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల నుంచి ఢిల్లీకి వస్తున్న ప్రయాణికులు కాలుష్యం బారిన పడకుండా ఎయిర్ ఏసియా యాంటీ పొల్యూషన్ మాస్క్ లను పంపిణీ చేస్తోంది. హెల్త్ టెక్నాలజీ స్టార్ట్ అప్ ఎంఫిన్ సంస్థ భాగస్వామ్యంతో విమాన ప్రయాణికులకు యాంటీ పొల్యూషన్ మాస్క్ లను అందిస్తోంది. ఢిల్లీలో వెలువడుతున్న కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినకుండా ముందుజాగ్రత్తగా యాంటీ పొల్యూషన్ మాస్క్‌లను ఈ నెల 19 నుంచి 29వతేదీ వరకు అందించాలని నిర్ణయించామని ఎయిర్ ఏసియా అధికార ప్రతినిధి వెల్లడించారు. విమాన ప్రయాణికులు కలుషిత వాయువులు పీల్చి అనారోగ్యం బారిన పడకుండా ఈ మాస్క్ లు ఎంతగానో ఉపయోగపడతాయని ఎయిర్ ఏసియా తెలిపింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!