భారత్ కు మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
- November 21, 2019
న్యూఢిల్లీ: భారత్ చేతికి ఇప్పటి వరకూ మూడు రాఫెల్ యుద్ధ విమానాలు అందినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం భారత వాయు సేన సిబ్బందికి (ఐఏఎఫ్) ఫ్రాన్స్‌లో శిక్షణ అందుతోందని లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా రక్షణ శాఖ సహాయక మంత్రి శ్రీపాద్ నాయక్ బుధవారం చెప్పారు. తొలి విమానాన్ని రాజ్‌నాథ్ అక్టోబర్ 8న స్వీకరించారు. రాఫెల్ విమానాలను ఫ్రాన్స్‌లోని డసోల్ట్ ఏవియేషన్ తయారు చేస్తోంది. ప్రస్తుతం భారత్ అందుకున్న 3 విమానాల్లో చివరి రెండు ఎప్పుడు అందుకున్నదన్న విషయాన్ని ఆయన చెప్పలేదు. 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో కేంద్ర ప్రభుత్వం 2016లో దాదాపు రూ.59 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మొదటి బ్యాచ్‌కు చెందిన 4 రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చే ఏడాది మే నెలలో మన దేశానికి రానున్నాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







