అమెరికాతో భారత్ భారీ ఆయుధ డీల్
- November 21, 2019
వాషింగ్టన్: అమెరికా నుంచి భారత్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేయనుంది. ఈ ఆయుధ ఒప్పందం విలువ రూ. 7 వేల కోట్లు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్కు సమాచారం అందించారు. భారత నౌకాదళానికి 13 ఎమ్కే45, 5 ఇంచ్/62 కేలిబర్ (మోడ్ 4) నావల్ గన్స్ అమ్ముతున్నట్లు ట్రంప్ చెప్పారు. వీటిని బీఏఈ సిస్టమ్స్ అండ్ ఆర్మామెంట్స్ సంస్థ తయారుచేస్తోంది. ఈ ఆయుధాల ద్వారా భారత్ పొరుగు దేశాల నుంచి తనకున్న ప్రమాదాలను ఎదుర్కోగలదని ట్రంప్ అధికార కార్యాలయం తెలిపింది. ఈ డీల్ ద్వారా అత్యాధునిక ఆయుధాలు కలిగిన దేశంగా భారత్ మారిందని చెప్పింది.
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







