జగన్ అక్రమాస్తుల కేసు విచారణ డిసెంబర్ 6కి వాయిదా
- November 22, 2019
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ డిసెంబర్ 6వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. మొత్తం 11 చార్జిషీటులకు సంబంధించి న్యాయస్థానం విచారణ జరిపిన తర్వాత తదుపరి విచారణను వచ్చేనెల 6కి వాయిదా వేసింది. ఏ-1 నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఏ-2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇద్దరూ కోర్టుకు హాజరు కాలేదు. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఎవరూ కోర్టుకు హాజరుకాలేదు. కేవలం ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ మాత్రమే హాజరయ్యారు.
15 రోజుల క్రితం జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడం సాధ్యంకాదని, ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే జగన్ అధికారిక పర్యటనలో బిజీగా ఉన్నందున ఆయన కోర్టుకు హాజరు కాలేరంటూ జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







