సీఎం జగన్ పాలన అద్భుతం: గణపతి సచ్చిదానంద
- November 23, 2019
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక విద్యను ఇంగ్లీష్ మీడియం బోధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అవధూత దత్తపీఠం వ్యవస్థాపకులు గణపతి సచ్చిదానంద స్వామి స్వాగతించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఇంగ్లీష్ మీడియం చదవులు వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోగల సత్తా వస్తుందని గణపతి సచ్చిదానంద అభిప్రాయపడ్డారు. పవిత్ర గంగానదిలో కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సచ్చిదానంద స్వామి అందులో భాగంగా శనివారం అతిరుద్రయాగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక కల్యాణం, ప్రజా సంక్షేమం కోసమే అతిరుద్ర యాగం నిర్వహించినట్లు తెలిపారు. హిందుధర్మ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన అద్భుతంగా ఉందని, వారసత్వ అర్చకత్వంపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా సీఎం జగన్ పాలన ఉందని కొనియాడారు. కాగా ప్రకృతి వైపరీత్యాల నివారణ కోసం చేపట్టిన అతిరుద్ర యాగానికి పలువురు భక్తులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







