సిరియాలో కారు బాంబు పేలుడు..షుమారు పది మంది మృతి, 20 మందికి పైగా గాయాలు
- November 24, 2019
అంకారా : ఈశాన్య సిరియాలో శనివారం జరిగిన కారు బాంబు పేలుడులో షుమారు పది మంది మృతి చెందినట్టు టర్కీ రక్షణ శాఖ తెలిపింది. ఈ దుర్ఘటనలో 20మందికి పైగా గాయాలయ్యాయి. టెల్‌అబియాడ్‌లోని పారిశ్రామిక వాడలో కారుబాంబు పేలుడు సంభవించింది. సిరియాలోని కుర్దీష్‌లే ఈ దాడికి పాల్పడి ఉంటారని మంత్రిత్వ శాఖ ఆరోపించింది. టెల్ అబియాడ్‌లో ఈ నెలలోనే అంతకుముందు రెండు కారు బాంబు పేలుళ్ళు జరిగి 21 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈశాన్య సిరియాలోని పలు ప్రాంతాలకు టర్కీ విస్తరిస్తూ కుర్దీష్ బలగాలను తన సరిహద్దుల నుండి దూరంగా నెట్టివేస్తోంది. కుర్దీషులను ఉగ్రవాదులుగా టర్కీ భావిస్తుంది. ఇదే కుర్దీష్‌లు సిరియాలో ఐఎస్‌ఐతో అమెరికాతో కలిసి పోరాడారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







