అమెరికా విలేఖరికి 18 కోట్ల డాలర్ల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ
- November 24, 2019
ఇరాన్ చెరలో 544 రోజులపాటు నిర్బంధాన్ని, చిత్రహింసలను ఎదుర్కొన్న ఒక అమెరికా విలేఖరికి 18 కోట్ల డాలర్ల (రూ.1292 కోట్లు) నష్టపరిహారం ఇవ్వాలని అమెరికా కోర్టు ఆదేశించింది. వాషింగ్టన్‌పోస్ట్ పత్రిక విలేఖరిగా ఇరాన్‌లో విధులు నిర్వహించిన జాసన్ రెజాయిన్ అనే విలేఖరిని.. గూఢచర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఇరాన్ ప్రభుత్వం 2014లో అరెస్టు చేసింది. అతడి భార్యను కూడా నిర్బంధించి ఆ తర్వాత విడుదల చేసింది. జాసన్‌ను మాత్రం 544 రోజులపాటు టెహ్రాన్‌లోని ఒక జైలులో నిర్బంధించి.. ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిడి మేరకు విడుదల చేసింది. అమెరికాకు చేరుకున్న జాసన్.. తనకు ఇరాన్ నుంచి పరిహారం ఇప్పించాలంటూ కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన ఫెడరల్ జడ్జి.. జాసన్‌కు 18 కోట్ల డాలర్ల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఇరాన్ స్పందించలేదు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







