అక్రమ బంగారు వ్యాపారం గుట్టు రట్టు
- November 24, 2019
విజయవాడ: నగరంలో సాగుతున్న అక్రమ బంగారు వ్యాపారం గుట్టును పోలీసులు రట్టుచేశారు. ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం విజయవాడకు వస్తోందన్న పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో రూ. 3.18 కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించారు. పట్టుబడ్డ వారిని ముంబైకి చెందిన జయేష్ జైన్, విజయవాడ ఇస్లాంపేటకు చెందిన పోగుల శ్రీనివాస్‌గా గుర్తించారు. నిందితులు సొంత లాభం కోసం బిల్లులు లేకుండా ముంబై నుంచి బంగారాన్ని తరలిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే వారు ఇప్పటి వరకు ఎంత బంగారం ఈ రకంగా తీసుకొచ్చారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి ముంబైలో మూలాలు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!