ఐసిస్‌కు దెబ్బ ! ఆఫ్ఘన్ లో 900 మంది లొంగుబాటు.. 10 మంది ఇండియన్స్ కూడా !

- November 26, 2019 , by Maagulf
ఐసిస్‌కు దెబ్బ ! ఆఫ్ఘన్ లో 900 మంది లొంగుబాటు.. 10 మంది ఇండియన్స్ కూడా !

 

ఆఫ్ఘనిస్థాన్ లో టెర్రరిస్టు సంస్థ ' ఐసిస్ ' కు పెద్ద దెబ్బ తగిలింది. ఇస్లామిక్ స్టేట్ ఫైటర్స్ తో బాటు సుమారు 900 మంది ఐఎస్ సభ్యులు ఆఫ్ఘన్ భద్రతాదళాలకు లొంగిపోయారు. ఇలా లొంగిపోయినవారిలో ఎక్కువమంది పాకిస్తానీయులు కాగా.. 10 మంది భారతీయులు కూడా ఉన్నారు . కేరళకు చెందిన మహిళలు, పిల్లలు వీరిలో ఉండడం విశేషం. ఐసిస్ ను అణచివేసేందుకు నాన్ గర్హార్ వంటి రాష్ట్రాల్లో ఆఫ్ఘన్ సెక్యూరిటీ దళాలు కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఈ ప్రావిన్స్ లోనే ఈ నెల 12 నుంచి వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనేకమంది తమ ఆయుధాలను వీరికి అప్పగించి సరెండర్ అయ్యారు. ముఖ్యంగా భారతీయుల్లో కేరళకు చెందిన కుటుంబాలను కాబూల్ కు తరలించారు. వీరి వివరాలను నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ సేకరిస్తోంది. ఈ రాష్ట్రంలో భారత్ కు చెందిన ఐఎఫ్ ఫైటర్లు చురుగ్గా ఉన్నారని, వీరిలో పలువురు వైమానిక దాడుల్లోనో, ఆఫ్ఘన్ సైనికులు జరిపిన కాల్పుల్లోనో మరణించి ఉంటారని భావిస్తున్నారు. 2016 నుంచి కేరళవాసుల్లో చాలామంది ఐసిస్ లో చేరేందుకు ఆఫ్ఘన్, సిరియా, ఇరాక్ వంటి దేశాలకు తరలి వెళ్లారు. వీరిలో మహిళలు, పిల్లలతో కూడిన కుటుంబాలు వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా కేరళలోని కన్నూర్, కేసర్ గడ్, కోజికోడ్, మలప్పురం ప్రాంతాల నుంచి అనేకమంది తరలివెళ్లినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com