శబరిమల వెళ్లేందుకు యత్నించిన బిందు అమ్మిని పై కారంపొడితో దాడి
- November 26, 2019శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు కొచ్చి వచ్చిన బిందు అమ్మిని అనే భక్తురాలిపై దాడికి పాల్పడ్డారు ఆందోళనకారులు. అనంతరం ఆమెకు వ్యతిరేకంగాకొచ్చిలో నిరసన చేపట్టారు. దీనిపై బిందు అమ్మిని మాట్లాడుతూ..తనను అడ్డుకోవటమే కాకుండా..తనపై దాడి చేసి.. కొంతమంది తన ముఖంపై కారం పొడి చల్లారంటూ బిందు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన కొంతమంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా..సామాజిక కార్యకర్త..మహిళా హక్కుల నేత తృప్తీ దేశాయ్‌తో బిందు శబరిమల వెళ్లే ప్రయత్నం చేశారు. దాని కోసం తమకు భద్రత కల్పించాలంటూ పోలీసు కమీషనర్ ఆఫీసుకు వచ్చారు. అదే సమయంలో బిందు అమ్మిని పై ఆందోళన కారులు కారంపొడి, పెప్పర్‌తో దాడి చేశారు. బిందు అమ్మిని కేరళలోని కన్నూరు వర్సిటీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్వసం సందర్భంగా తాము శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకుంటామని మహిళా హక్కుల కార్యకర్త తృప్తీ దేశాయ్ తెలిపారు. ( ఈరోజుకు భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 70 ఏళ్లు) రాజ్యాంగం పురుషులకు, మహిళలకు సమాన హక్కులను ఇచ్చింది. కాబట్టి తాము అయ్యప్ప దేవాలయాన్ని దర్శించుకుని తీరుతామని ఆమె స్పష్టం చేశారు. తమకు పోలీసులు సెక్యూర్టీ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆలయానికి వెళ్లి తీరతామని తృప్తీ దేశాయ్ అన్నారు. ఈ క్రమంలో తమపై దాడి జరిగితే దానికి పోలీసులే బాధ్యత వహించాలన్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







